ఇచ్చోడ: బీజేపీ సభ్యత్వ నమోదును వేగవంతంగా చేయాలి
ఇచ్చోడ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం సోమవారం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ 100 సభ్యత్వం చేసి క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవాలని ఆయన కోరారు. సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నాయకులు మయూరి చంద్ర, బాబా రావు పాటిల్, మాధవరావు, నారాయణ కేంద్రే, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.