సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. పట్టణంలోని 3, 4, 5, 18వ వార్డుల్లో రూ. 2 కోట్ల వ్యయంలో నిర్మించనున్న సీసీ రోడ్లు, డైనేజీల పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.