పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపే మల్లేశ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేస్తూ మరోవైపు నిత్యావసరాల ధరలను పెంచి పేద ప్రజలపై భారం మోపుతుందన్నారు. ఈ ధరలు అడ్డూఅదుపు లేకుండా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు.