బిఆర్ఎస్ పార్టీ పోరాటంతోనే రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ విద్యుత్ చార్జీలు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని బిఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి బుధవారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని రద్దు చేయడాన్ని బిఆర్ఎస్ పార్టీ విజయంగా అభివర్ణిస్తూ రాష్ట్ర కమిటీ పిలువు మేరకు అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు.