రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పెళ్లి కాని ఆడపడుచులకు ఓ వరం లాంటిదని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రజిత అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో 24 మంది లబ్దిదారులకు శుక్రవారం కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్పర్సన్ అనిత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.