ఫోన్ పోయిన అరగంటలోనే దొరికిన సంఘటన ఆదివారం హుస్నాబాద్ లో చోటు చేసుకుంది. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో హమాలీ కార్మికుడు మల్లయ్య రూ. 20 వేల విలువైన ఫోన్ ను పోగొట్టుకున్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీను, ఎస్సై మహేశ్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ మొగిలినాయక్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేసి అరగంటలో పట్టుకొని బాధితుడు మల్లయ్యకు అప్పగించారు.