హుస్నాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు కరీంనగర్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి, ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఆలయ నిర్మాణానికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారన్నారు.