హుస్నాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు

85பார்த்தது
హుస్నాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు
ప్రొఫెసర్ సాయిబాబా మరణం నవ సమాజానికి తీరని లోటని దళిత, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న జి. ఎన్ సాయిబాబా అకాల మరణానికి చింతిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామని అన్నారు.

தொடர்புடைய செய்தி