ఈనెల 3న ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా మాదిగల ధర్మ యుద్ధ సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకట్ స్వామి పిలుపునిచ్చారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లా ధర్మయుద్ధ మహాసభ ఈ నెల 3న సిద్దిపేటలో జరిగే సమావేశానికి మందకృష్ణ మాదిగ హాజరై, దిశ నిర్దేశం చేస్తారన్నారు.