కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ పథకం హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ వారి నేతలకు వచ్చేలా చూసుకుంటున్నారని, బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ గురువారం ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకనైనా పేద, మద్య తరగతి వర్గాలకు ఈ పథకం అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.