ప్రతి మహిళ ఏదో ఒక ప్రభుత్వ పథకంతో లబ్ది పొంది ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ లో సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సెట్విన్ శిక్షణ కేంద్రంలో కుట్టు మిషన్, బ్యూటిషన్, కంప్యూటర్ ల్యాబ్, ఐటీఐ మెకానిక్స్ ఎంఎస్ అకౌంటెంట్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు.