సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా హుస్నాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రంథాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.