సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకరణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయం సాఫీగా సాగాలని ఆకాంక్షించి, రైతులకు 2 లక్షల రూపాయల వరకు 31వేల కోట్ల ఋణ మాఫీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు.