సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని దాసరి అర్చన ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమిస్తున్న విషయం తల్లిదండ్రులకు తెలవడంతో మరో సంబంధం వెతికి వెళ్లికి ఒప్పించారు. తల్లిదండ్రులు మంగళవారం పొలం పనులకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.