మనిషి ఆరోగ్యానికి నోటి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, డెంటల్ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి రెండవ వార్డ్ నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నీలకంఠ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో బుధవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని వార్డు కౌన్సిలర్ నాయిని చంద్రంతో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ప్రారంభించారు.