పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్ బాల్ క్రీడాకారుల ఎంపిక ఈ నెల 5న హుస్నాబాద్ లోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎస్జిఎఫ్ సెక్రటరీ సౌందర్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్- 14, 17 బాలబాలికలకు హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. రాణించిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.