దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో సోమవారం వడ్లకొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మార్వో వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రైతులు వడ్ల తేమ శాతం ప్రభుత్వం నిర్ణయించిన దానికి అనుగుణంగా సరిచేసుకోవాలని రైతులను కోరారు. దళారుల మాటలకు మోసపోయి దాన్యాన్ని అమ్ముకోవద్దని ఆయన రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదికారులను అదేశించారు.