పేదరికంతో అనారోగ్యం బారినపడి ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక నిరుపేద కుటుంబానికి చెందిన బెల్లె కనకరాజు మృతి చెందిన సంఘటన గురువారం దుబ్బాక మున్సిపల్ పరిధిలో జరిగింది. బెల్లె రాజవ్వ కీ. శే. మల్లయ్య దంపతుల కుమారుడు కనకరాజు రోజువారి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి అనారోగ్యానికి గురై గతంలోనే మృతి చెందాడు. గతంలో తండ్రి మృతి చెందడంతో తల్లి రాజవ్వ కొడుకుకు తలకొరివి పెట్టింది.