దుబ్బాక 108లో పైలట్ గా విధులు నిర్వహిస్తూ మరణించిన కైరంకొండ లింగం కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర 108, 102 ఎఫ్ఎస్ హేచ్ ఉద్యోగులు అండగా నిలిచారు. వారు సేకరించిన రూ. 209, 535 విరాళాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ పత్రాలను లింగం కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, సిద్దిపేట జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫ్రజ్ తదితరులు పాల్గొన్నారు.