కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు చింతల కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని పోతారెడ్డి పేటలో ఇటీవల కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధ్యాన్యాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఇటీవల పోతారెడ్డి పేట వడ్ల కొనుగోలు ప్రారంభంలో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించలేదన్నారు.