తిమ్మాపూర్ నుండి అందే వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజల ప్రయాణానికి, వాహనదారులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ సమస్యను గత రెండేళ్ల నుండి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి మాజీ జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పర్శారాములు తీసుకెళ్తూ వచ్చారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడడంతో ఆదివారం తిమ్మాపూర్ నుండి పద్మనాభునిపల్లి వరకు తాత్కాలిక రోడ్డు పనులు జరిగాయి.