సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం గురువారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ కైలాసం, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులు వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్ముకోవాలని రైతులకు సూచించారు.