కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు, బలహీన వర్గాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కిష్టయ్య, జోగ్గారి భాస్కర్ లు అన్నారు. శనివారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పట్ల వారు చర్చించారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.