సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని 132 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నిర్వహణలో భాగంగా మాచిన్ పల్లి, చెట్లనర్సంపల్లి గ్రామాలకు ఆదివారం ఉదయం 11: 30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్తు శాఖ ఏఈ వాసుదేవరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.