నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాము: మున్సిపల్ కమిషనర్

73பார்த்தது
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాము: మున్సిపల్ కమిషనర్
అక్రమ నిర్మాణాల మీద మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఐదోవార్డులో తప్పుడు పత్రాలతో అనుమతి పొంది ఇల్లు నిర్మిస్తున్నారనే ఫిర్యాదు మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి దేవరాజ్ ఆధ్వర్యంలో కూల్చి వేశారు. అలాగే 32వ వార్డు ఎర్రచెరువు బఫర్ జోన్ పరిధిలో ఇంటిని నిర్మిస్తుండగా మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி