జహీరాబాద్ పట్టణంలోని గడి మహెలకు చెందిన తహేరా బేగం అనే మహిళ గత కొంత కాలంగా కంటి సమస్యతో బాధపడుతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సిద్దం ఉజ్వల్ రెడ్డి, రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి దృష్టికి శుక్రవారం ఈ విషయాన్ని తీసుకెళ్లగా వారి సహాయంతో మహిళకు హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో కంటి ఆపరేషన్ చేయించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు సహాయం అందించిన వారికి పూలమాలలు, శాలువాతో సన్మానించారు.