జహీరాబాద్ మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి మహిపాల్ బుధవారం వినతి పత్రం సమర్పించారు. సిఐటియు కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ, కార్మికులకు పండగ వేతనాలు ఇవ్వకపోవడం సరికాదని చెప్పారు. వేతనాలు చెల్లించకుంటే విధులను బహిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.