కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కార్మిక చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. లేబర్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుందని విమర్శించారు. ధర్నాలో సంఘం నాయకులు పాల్గొన్నారు.