సంగారెడ్డి మున్సిపాలిటీలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ప్రత్యేక బృందాలు పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. వ్యాపారులు ఎవరైనా నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.