కొండాపూర్ మండలం లక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు వేదమంత్రాలతో జరిపించారు. భక్తులు జై లక్ష్మీనారాయణ అంటూ నామస్మరణ చేశారు. ఆలయంలో ప్రతి రెండో ఆదివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.