సంగారెడ్డి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే 4, 09, 718 ఇళ్లలో పూర్తి చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఒక్క రోజు 20,147 ఇళ్లలో ఎన్యుమరేటర్లు సర్వేను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని కోరారు.