జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేష్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టాలని చెప్పారు. దసరా సెలవుల్లో ఇళ్లకు వెళ్తున్నందున పెట్రోలింగ్ కార్యక్రమం వేగవంతం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.