సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం రెండో రోజు కూడా కొనసాగింది. జిల్లాలోని వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారు. విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టుల గురించి తోటి విద్యార్థులకు వివరించారు. 23వ తేదీన ముగింపు కార్యక్రమం జరుగుతుందని డిఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు.