డీఎస్సీ 2024 ఎంపికైన స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు శనివారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ డీఈవో సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.