ప్రజావాణి కార్యక్రమన్ని డివిజన్, మండల స్థాయిలో నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఫోరమ్ ఫర్ బెట్టర్ సంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమాన్ని మండల, డివిజన్ కేంద్రల్లో నిర్వహించాలన్నారు. సమస్యల పరిష్కారం కొరకు వారంతంలో జిల్లా అధికారులు శాఖల వారీగా సమీక్షలు జరపాలన్నారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.