ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కల్పించాలని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని ఉపాధ్యాయ భవన్లో జిల్లా కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామచంద్ర పాల్గొన్నారు.