ప్రజా సమస్యలపై పోరాటాలు చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అన్నారు. కందిలో మండల కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. హామీల అమలు కోసం ఆందోళన చేద్దామని చెప్పారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.