గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన తప్పులనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిర్చి యార్డులో రైతులకు బేడీలు వేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధరాత్రి అరెస్టులు కొనసాగిస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాటలు, చేతలకు పొంతన లేదని చెప్పారు.