జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహిస్తామని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ నీరజ ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిని ఫల పరిశోధన కేంద్రంలో డ్రాగన్ ఫ్రూట్ మేళాను మంగళవారం నిర్వహించారు. డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు పై రైతులకు అవగాహన కల్పించేందుకు మేళా నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.