ప్రతి ఒక్కరు ఇంట్లో మరుగుదొడ్డిని వినియోగించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్డి మహిళల ఆత్మ గౌరవానికి ప్రత్యేక అని చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డిఆర్డిఓ జ్యోతి,డిపిఓ సాయిబాబా పాల్గొన్నారు.