సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని జయ దుర్గా దేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు గురువారం అమ్మవారిని దుర్గాదేవి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు వేదమంత్రాలతో జయదుర్గాదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.