సంగారెడ్డి జిల్లా కోర్టులో బతుకమ్మ సంబరాలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. మహిళ న్యాయమూర్తులు, న్యాయవాదులు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడారు. అనంతరం మహబూబ్ సాగర్ చెరువులో బతుకమ్మలను వదిలిపెట్టారు.