విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంఈఓ శంకర్ అన్నారు. సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం పరిశీలించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందొ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తినే భోజనాన్ని ఉపాధ్యాయులు ప్రతిరోజు పరిశీలించాలని సూచించారు.