విద్యార్థులు చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సదాశివపేట మండలం నిజాంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు.