ర్యాగింగ్ చట్ట రిత్య నేరమని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ వ్యతిరేక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులకు సహకారం అందించాలని చెప్పారు. మాదకద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న 8712656777 నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు.