తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్, అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కళాశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో మంచిని సమస్య ఉందని ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.