అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోకుండా తార్పాలెం కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కండి మండలం ఆరుట్ల గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని రైతులు తెచ్చేలా అధికారులు చూడాలని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.