బాలికలు రక్తహీనతలు అధిగమించాలని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ బాయి అన్నారు. సంగారెడ్డిలోని మహిళా డిగ్రీ కళాశాలలో జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు సోమవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ 165 మంది విద్యార్థినిలకు రక్త పరీక్షలు చేసినట్లు చెప్పారు. రక్తహీనత ఉన్న విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేశారు.