అర్హులైన ప్రతి ఒక్కరు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు పై జిల్లాలో విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. https: //ceotelangana. nic. in వెబ్ సైట్ లో నవంబర్ 6 లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.