ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాదులో సోమవారం సమావేశం అయ్యారు. జిల్లాలోని నాయకులకు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి సమావేశంలో చర్చించారు. దసరా నాటికి నామినేట్ పోస్టులు భర్తీ చేసేలా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని మంత్రులు తెలిపారు.